నేటితో ముగిసిన టీజీ ఎప్​ సెట్ దరఖాస్తులు

by M.Rajitha |
నేటితో ముగిసిన టీజీ ఎప్​ సెట్ దరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కు దరఖాస్తు గడువు ముగిసింది. గురువారం నాటికి 3,06,796 దరఖాస్తులు వచ్చాయని ఎప్ సెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు దీంట్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో 2,20,049 ధరఖాస్తులు వచ్చాయని, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్​ లో 86,493 ధరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రెండింటికీ 254 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రూ.5వేల ఫైన్​ తో దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసి విభాగం అభ్యర్థులకు ఈనెల 29,30 తేదీల్లో, మే 2 నుంచి 4 వరకూ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులుకు పరీక్షలు నిర్వహించనున్నారు.



Next Story