- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్ బోర్డు ఎదుట ABVP ఆందోళన.. డిమాండ్ ఏంటంటే?

దిశ, తెలంగాణ బ్యూరో: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో గురువారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, కార్పొరేట్ కాలేజీల దందాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వితేజ మాట్లాడుతూ, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఒకే అనుమతితో అనేక బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. అనుమతి లేని కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, 10వ తరగతి ఫలితాలు రాకముందే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్న కార్పొరేట్ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు.