CM Revanth: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరి: సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-18 09:24:05.0  )
CM Revanth: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరి: సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంతో పోటీ పడేలా నాటి ప్రధాని పీవీ నరసింహా‌రావు (Former prime minister P.V Narasimha Rao) దేశంలో ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024 అవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన కృషిని ఎవరూ మరువలేరని అన్నారు. విధానపరమైన రూపకల్పనలు లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి చెందదని తెలిపారు.

ప్రభుత్వం విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం డెవలప్‌ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పాలకులు మారినా.. విధానాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. 1994-2004 మధ్య కాలంలో చంద్రబాబు (Chandrababu) ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2004 తరువాత కూడా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajashekar Reddy) వాటిని కొనసాగించారని పేర్కొన్నారు. మంచి పనులు ఎవరు చేసినా.. వాటిని కొనసాగిస్తామని తెలిపారు. సమగ్ర అధ్యయనంతో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటు ఉంటుందని అన్నారు.

అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేందుకు కొత్తగా ఫ్యూచర్ సిటీ (Future City)ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మూసీ నది (Moosi River) ప్రక్షాళన చేపట్టామని అన్నారు. మూసీ అంటే మురికి కూపం కాదని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. ప్రపంచ పర్యాటకులు మూసీని వచ్చి చూసేలా తయారు చేస్తామని, అమెరికా, లండన్ మాదిరిగా నదిని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ అన్నారు. ఒకప్పుడు కృష్ణా జిల్లా (Krishna District)లో ఎకరం అమ్మితే.. హైదరాబాద్‌ (Hyderabad)లో ఎకరాలకు ఎకరాలు కొనేవాళ్లని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీ (Andhra Pradesh)లో 100 ఎకరాలు కొనొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతుల అభ్యున్నతి దృష్టిని పెట్టుకునే వారికి రూ.2 లక్షల రుణమాఫీ (Loan waiver) చేశామని స్పష్టం చేశారు. అయినా రైతుల కష్టాలు తీరడం లేదని అన్నారు. ఒక కుటుంబంలో అంతా వ్యవసాయానికే పరిమితం కావొద్దని, ఆ పని కొనసాగిస్తేనే ఇతర రంగాలపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

Next Story