CM Revanth: కాసేపట్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ!

by Shiva |   ( Updated:2025-02-22 05:30:38.0  )
CM Revanth: కాసేపట్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై రగడ కొనసాగుతోన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఉన్న బీసీ (BC) నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో ప్రజాభవన్‌ (Praja Bhavan)లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ (TPCC Chief Mahesh Kumar Goud) కూడా హాజరుకానున్నారు. భేటీలో భాగంగా బీసీ రిజర్వేషన్లు (BC Reservations), ఎస్సీ ఉప కులాల వర్గీకరణ (Classification of SC Sub-castes) చట్టాల కోసం మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ (Assembly) ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించనున్నారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆ సామాజికవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed