- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth: రాష్ట్ర ప్రజలకు హోలీ విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా హోలీ సంబురాలు (Holi Celebrations) అంబురాన్నంటాయి. తెలంగాణ (Telangana) యువత రంగుల్లో తేలియాడుతూ.. పండగను పీక్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా మహిళలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ‘రంగ్ బర్‌సే’ అంటూ ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ హోలీ వైబ్ (Holi Vibe)ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హోలీ పర్వదినం సందర్భంగా సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సప్తవర్ణ శోభితం.. సకల జనుల సంబురం.. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా రంగుల పండుగను వైభవోపేతంగా జరుపుకోవాలని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే హోలీ సమైక్యతకు అద్దం పడుతుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిస్తూ.. హోలీ పండుగ అందరి కుటుంబాల్లో ఆనందోత్సవాలు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.