- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకు గుడ్ న్యూస్.. లక్ష రూపాయల స్కీమ్ ను ప్రారంభించిన సీఎం
దిశ, వెబ్ డెస్క్: బీసీల్లోని కుల వృత్తి, చేతి వృత్తులవారికి ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. కాగా తాజాగా మంచిర్యాలలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 'బీసీల్లోని కులవృత్తి, చేతి వృత్తి కులాల వారికి ఆర్థికసాయం' పథకాన్ని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో సీఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా తోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన కుందారపు మురళి ( కుమ్మరి వృత్తి)కి, భీమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణ (నాయి బ్రాహ్మణ వృత్తి) కు సీఎం కేసీఆర్ రూ.లక్ష రూపాయల చెక్కును తన చేతుల మీదుగా వారికి అందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పలు పథకాలతో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా దూసుకుపోతోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో చేశామన్న సీఎం.. చేయాల్సింది ఇంచా చాలా ఉందని అన్నారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయని సీఎం చెప్పారు.