- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భట్టి పాదయాత్రపై సీఎం కేసీఆర్ సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: భట్టి పాదయాత్రపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సీఎం కేసీఆర్ ఆయనపై విరుచుకుపడ్డారు. తన పాదయాత్రలో భట్టి సెల్ఫ్ సర్టిఫికేషన్ గొప్పగా ఇచ్చుకున్నారని ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్ర వల్ల తమకొచ్చిన నష్టం ఏం లేదని, కావాలంటే మరోసారి పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, నెహ్రూనేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 58 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం నడిచిందని అన్నారు.
తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. 1969 ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చాలా కర్కషంగా వ్యవహరించిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత పోరాటం చేసిన నో తెలంగాణ అని ఇందిరాగాంధీ ఆనాడు అన్నది చరిత్ర కాదా అని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు వాగుతున్నారని అన్నారు. ఎవరెన్ని అన్నా తమ సంక్షేమ పథకాలను మాత్రం ఆపేది లేదని సీఎం స్పష్టం చేశారు.
Read More..