- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్.. మోడీపై సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోడీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోడీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి’’ అని దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో ఇటీవల గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి రెండేండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని అనర్హత వేటు వేసినట్లు ఆ ప్రకటనలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1) (ఈ)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు వేసినట్లు తెలిపారు. కేరళలోని వయానాడ్ లోక్‌సభ్యుడిగా ఉన్న ఆయనపై అనర్హత వేటు వేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నది.