- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్యాసినో కింగ్ చీకోటి గ్యాంగ్‌కు కఠిన శిక్షలు తప్పవా.. ‘‘థాయ్’’ చట్టాలు ఏం చెబుతున్నాయంటే..?
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: థాయ్ లాండ్ చట్టాలను గమనిస్తే గ్యాంబ్లింగ్ కేసులో పటాయాలో అరెస్టయిన క్యాసినో కింగ్చీకోటి ప్రవీణ్ కుమార్అ తని సహచరులకు కఠిన శిక్షలు తప్పవనిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశ చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ నిర్వహించటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. బౌద్దిజాన్ని అనుసరించే థాయ్ పౌరులు కూడా జూద కార్యకలాపాలను అత్యంత హేయమైన చర్యగా భావిస్తారు. థాయ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే లాటరీలు తప్ప మరే రకంగానూ ఆ దేశంలో గ్యాంబ్లింగ్ నిర్వహించటం.. ఆడటం పూర్తిగా నిషిద్దం.
1935లోనే..
థాయ్ప్రభుత్వం 1935లోనే దేశవ్యాప్తంగా గ్యాంబ్లింగ్‌ను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. బౌద్దిజాన్ని అనుసరించే ఆ దేశ పౌరులు ప్రభుత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతించారు. స్వచ్ఛందంగా దీని అమలుకు సహకరిస్తూ వస్తున్నారు. నిజానికి చెప్పాలంటే బౌద్దిజం ప్రకారం గ్యాంబ్లింగ్నిర్వహించటం.. ఆడటాన్ని తీవ్రమైన పాపంగా ఆ దేశ పౌరులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఎక్కడా అధికారిక క్యాసినోలు కనిపించవు. చివరకు పోకర్రూములు, ఆర్కెడ్గేములు, క్రీడల్లో బెట్టింగులు పెట్టటం వంటివి అగుపించవు.
అయితే, విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల నుంచి డబ్బు కొల్లగొట్టే లక్ష్యంతో స్థానికులు కొందరు రెస్టారెంట్ల బేస్మెంట్లు, అండర్ గ్రౌండ్ పార్కింగులు, ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో పోలీసుల కళ్లుగప్పి గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న థాయ్పోలీసులు ఎప్పటికప్పుడు ఇలా అక్రమంగా నడుస్తున్న గ్యాంబ్లింగ్ డెన్‌లపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేయటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అక్కడి విమానాశ్రయాల వద్ద గ్యాంబ్లింగ్ నాట్పర్మిటెడ్ అన్న బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు ఈ కార్యకలాపాలకు దూరంగా ఉండండి అంటూ అవగాహన కల్పిస్తున్నారు.
జీవిత శిక్ష.. భారీ జరిమానాలు..
నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ.. ఆడుతూ పట్టుబడితే థాయ్ చట్టాల ప్రకారం యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు భారీ మొత్తాల్లో జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అక్రమంగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న వారికి, ఆడుతున్న వారికి సహకరించిన పలువురు అధికారులకు సైతం ఆ దేశ న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. విదేశీ పర్యాటకులకు సైతం శిక్షలు పడ్డ సంఘటనలు ఉన్నాయి. వారి వీసాలను సస్పెండ్ చేశారు కూడా.
ప్రతిపాదన దశలో బిల్లు..
విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు పటాయాకు వస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క సిటీలో గ్యాంబ్లింగ్‌ను అనుమతించే దిశలో థాయ్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. క్యాసినోలు ప్రారంభించటం వల్ల తమ దేశ పౌరులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు దొరకటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు చట్టం తీసుకు రావాలన్న యోచనలో ఉంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉన్నట్టు సమాచారం.