Chandrababu: తెలంగాణలో వర్షాలపై చంద్రబాబు ఆరా.. కారణం ఇదే

by Prasad Jukanti |
Chandrababu: తెలంగాణలో వర్షాలపై చంద్రబాబు ఆరా.. కారణం ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. శనివారం విజయవాడలో ఏపీ మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వర్షాలు కురిస్తే దాని వల్ల ఏపీకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం కకావికలం అయిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాకు ఆనుకుని ఏపీ జిల్లాలు సైతం తీవ్ర స్థాయిలో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో కురిసే వానల విషయంలో అలర్ట్ గా ఉండాలని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఏపీ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story