- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Chamala: బీఆర్ఎస్, బీజేపీల మైత్రి బయటపడింది.. ఎంపీ చామల కిరణ్ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ ల మైత్రి(Alliance) లగచర్ల ఘటనతో బయటపడిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. లగచర్ల ఘటన(Lagacharla Incident)పై బీజేపీ(BJP) నాయకుల మాటలపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా.. నిన్న కొడంగల్(KOdangal) లో జరిగిన ఘటనపై బీజేపీ వ్యాఖ్యలు చూస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఏ బంధం ఉందో అర్థం అవుతుందని అన్నారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Elections) బీఆర్ఎస్ ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్(Open Support) చేస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేశారని వాస్తవాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. అసలు ఏం జరగనట్లుగా బీజేపీ మాట్లాడటం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ వల్లే బీజేపీకి 8 సీట్లు వచ్చాయని, ఇప్పడు మహారాష్ట్రలో కూడా అదే మైత్రి కొనసాగుతోందని ఆరోపించారు. అంతేగాక ఏసీబీ విచారణ(ACB Investigation)కు ఆదేశించాక ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో తప్పించుకోవడానికి కేటీఆర్(KTRBRS) ఢిల్లీ(Delhi Tour)కి వచ్చి బీజేపీ నాయకుల(BJP Leaders)తో మంతనాలు జరపడం.. గవర్నర్(Governor) 15 రోజుల నుంచి విచారణను పక్కకు పెట్టడం.. కేంద్ర ప్రభుత్వ అధికారి(Central Government Official)పై దాడిపై బాధ్యత లేకుండా మాట్లాడటం.. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రి తేటతెల్లమవుతుందని చెప్పారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్క తానులోని రెండు ముక్కలని(Two Parts Of One) ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చామల కిరణ్ వ్యాఖ్యానించారు.