- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కులగణనపై అసెంబ్లీలో తీర్మానం.. గాంధీ భవన్‌లో సంబురాలు

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కాంగ్రెస్‌లో హర్షాతిరేకలు వెల్లివిరిశాయి. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్‌లో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పుచప్పులతో నాయకులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చారు. ఆపై స్వీట్లు పంచుకొని వేడుకలు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, మాజీ మంత్రులు చంద్రశేఖర్, పుష్పలీల, ఏపూరి సోమన్న, నమిల్ల శ్రీనివాస్, సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మార్క్: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
కాంగ్రెస్మార్క్విజయానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నిదర్శనంగా నిలుస్తాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. అసెంబ్లీలో కులగణనపై అసెంబ్లీలో తీర్మానంపై సీఎం రేవంత్, మంత్రుల బృందానికి టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్ట్‌లో పొందుపరిచిన విధంగా కులగణన, ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టిందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సాహసోపేతమైన నిర్ణయాలు అని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో గొప్ప అధ్యాయాలు కులగణన, ఎస్సీ వర్గీకరణ నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కులగణన సర్వే చేపట్టి పూర్తి చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది, అనడానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు అవకులు, చెవాకులు పేల్చడం మానుకోవాలని సూచించారు. బీసీ, ఎస్సీల కోసం పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందేమిటో? కవిత, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని పీసీసీ ఛీప్ప్రశ్నించారు.