Ex-BRS MLA: ఆ ఘటనపై మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

by Ramesh N |
Ex-BRS MLA: ఆ ఘటనపై మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) పై కేసు నమోదు నమోదు అయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని గువ్వల బాలరాజుపై ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గువ్వల బాలరాజుపై, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ (Vamsikrishna) ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు, అధికారులు ఆలయంలోకి అనుమతించలేదని ఆరోపణలు. ఈ క్రమంలోనే పోలీసులతో గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నేతల వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట కూడా జరిగింది. దీంతో ఆలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.

Next Story

Most Viewed