- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. MLA ప్రయాణిస్తున్న కారును మంగళవారం ఓ ఆటో ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఆటో ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కారు ముందు టైరు ఊడిపడింది. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి కూడా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేను మరో కారులో ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story