అవి వారి వద్దే కొనండి.. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు రాజాసింగ్ కీలక సూచనలు

by Ramesh Goud |
అవి వారి వద్దే కొనండి.. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు రాజాసింగ్ కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: మహా శివరాత్రి (Maha Shivarathri) పర్వదినం సందర్భంగా గోషామహల్ (Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) హిందువులకు కీలక సూచనలు (suggestions) చేశారు. పూజా సామాగ్రి విక్రయాలపై (puja materials) ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందిస్తూ.. వీడియో (Video) విడుదల చేశారు. ఈ వీడియోలో పూజా సామాగ్రి విక్రయం (Puja Material Sales) విషయంలో పాటించాల్సిన నియమాల గురించి చెబుతూ.. ప్రజలకు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న మహా శివరాత్రి రోజు ప్రతీ దేవాలయం (Every Temple) లో పూజా కార్యక్రమం (Puja Programme) చాలా వైభవంగా జరుగుతోందని, చాలా మంది శివ భక్తులు (Devotees Of Shiva) వ్రతాలు చేసుకుంటారని, ఉదయం కానీ సాయంత్రం కానీ గుడికి వెళ్లి అభిషేక (abhishekam) కార్యక్రమాలు జరుపుకుంటారని తెలిపారు.

ఇందుకోసం ఉపయోగించే పూజా సామాగ్రిని ప్రతీ ఒక్క శివ భక్తుడు హిందువుల వద్దే కొనాలని విజ్ఞప్తి చేశారు. పూలను (flowers), కొబ్బరికాయలను (coconuts), స్వీట్లను (Sweats) హిందువుల వద్దే కొనాలని కోరారు. పూజలను ఎంతో పవిత్రంగా చేసుకుంటామని, అలాంటప్పుడు పూజకు ఉపయోగించే సామాగ్రి కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. వస్తువులు కొనే ముందు.. వాటిని విక్రయించే వారు పవిత్రంగా ఉన్నారా లేదా చూడాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా లేదా చూసి, కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. దేవుడి అనుగ్రహం మనపై ఉండాలంటే పూజ సరిగ్గా నిర్వహించాలని, పూజ సరిగ్గా జరగాలంటే సామాగ్రి పవిత్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని బీజేపీ నేత హితవు పలికారు.

Next Story