‘ఆటో’ పాలిటిక్స్.. కాళేశ్వరం డ్యామేజీ డైవర్ట్ కోసమేనా?

by Ramesh N |
‘ఆటో’ పాలిటిక్స్.. కాళేశ్వరం డ్యామేజీ డైవర్ట్ కోసమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల నిరసనలు ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోలో వస్తున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిన్నటి నుంచి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ విధంగా నిరసన తెలుపుతూ.. ఆటోలో అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అయితే అసెంబ్లీలోకి ఆటోలను పోలీసులు అడ్డుకోవడంతో అసెంబ్లీ గేటు వద్ద కొద్ది సేపు హైడ్రామా నడుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు అయిన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం అందరికీ తెలిసిందే. అందులో గత ప్రభుత్వం అవినీతి వల్లే పిల్లర్లు కుంగి పోయాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ కాళేశ్వరం డ్యామేజీ డైవర్ట్ చేయడం కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే ముందు ఆటో డ్రైవర్ల సమస్యలు లేవనెత్తుతున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇదివరకే హామీ ఇచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.

ఆటో డ్రైవర్లను అవమానిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఈ వ్యవహారంపై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు ఎక్కి ఆటో డ్రైవర్లను అవమానిస్తున్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలన్నీ ప్రేరేపించినవేనని చెప్పారు. ఆటో డ్రైవర్లను ముందు పెట్టి డ్రామాలు ఆడుతున్నారన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకు వచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story