Talasani : పశ్చాత్తాపంలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : తలసాని

by Y. Venkata Narasimha Reddy |
Talasani : పశ్చాత్తాపంలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : తలసాని
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ(Congress)లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే(Brs Mla)లు తమ నిర్ణయానికి పశ్చాత్తాపం(Repentance) పడుతున్నారని..అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళతారని..బీఆర్ఎస్ఎల్పీ విలీనమవుతుందన్న వార్తలు వట్టి ఊహాగానాలేనని(Speculation News)...వాటిని పట్టించు కోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Talasani Srinivasa Yadav) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పార్టీ వైఖరిని ఈ నెల 17 న ఖరారు చేస్తామని..మేయర్ పై అవిశ్వాసం పెట్టే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుందని...మా వ్యూహాలు మాకుంటాయన్నారు.

కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరిత కార్యక్రమంగా మార్చేసిందని..అందుకే మాతో పాటు అన్ని బీసీ సంఘాలు కూడా మళ్ళీ సర్వే చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో ,పట్టణాల్లో సర్వే ఎక్కడా సరైన రీతిలో జరగలేదని, ఆరవై లక్షల జనాభాను తక్కువ చేసి చూపారని, ఎన్నికల ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినా కులగణన లెక్కలు తప్పు అని తేలిపోయిందన్నారు. జనాభా తక్కువుంటే కేంద్ర నిధులు తక్కువగా వస్తాయన్న సోయి కూడా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ లో జనసంఖ్య తక్కువ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. శాస్త్రీయంగా సర్వే జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పై అసెంబ్లీలో చట్టబద్దత చేస్తే లాభం లేదని..కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.

కేసీఆర్ గతం లోనే బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేశారని గుర్తు చేశారు. బీసీలు అడుక్కు తినేవాళ్లు కాదని..తామెంతో తమకంత అని బీసీలు నినదిస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని..రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దేశానికే ఆదర్శంగా తెలంగాణ ను తీర్చిదిద్దారని..ఆయన పుట్టిన రోజ సందర్భంగా ఈ నెల 17 న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నామని, కేక్ కటింగ్ తో పాటు కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడిని ఈ సందర్భంగా విడుదల చేస్తున్నామని, ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తలసాని వెల్లడించారు. ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed