- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly : హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. ఇకనైనా పనులపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. ఇకనైనా పనులపై పనులపై దృష్టి పెట్టండని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన సమావేశాల్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నగరానికి కేటాయించిన బడ్జెట్ సరిపోదన్నారు. జీహెచ్ఎంసీ నిద్రావస్థలో ఉందన్నారు. గతంలో చాలా కాలనీలను వరద ముంపు నుంచి కాపాడగలిగామని గుర్తుచేశారు. ప్రస్తుతం 17 ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయన్నారు.
ప్రభుత్వం పట్టించుకోక పోతే నాళాలు ఉప్పొంగి ఇళ్ళలోకొచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనావస్థకు చేరిందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని సూచించారు. దేశంలోనే 50 శాతం ఐటీ ఉద్యోగాలు నాటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదేళ్లు ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడారని ధ్వజమెత్తారు. ఐటీ అభివృద్ధి విషయంలో మంత్రికి తాము సహకరిస్తామని అన్నారు.