- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ న్యూస్: పేపర్ లీక్ ఇష్యూ నుండి తప్పించుకునేందుకు BRS మాస్టర్ ప్లాన్.. రంగంలోకి కీలక నేత!
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్స్ లీక్ ఎపిసోడ్‌కు ప్రభుత్వం రాజకీయ రంగు పూసిందనే చర్చ మొదలైంది. కమిషన్ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి విపక్షాలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. మూడు నాలుగు రోజులుగా పేపర్స్ లీక్ వ్యవహారంతో ప్రభుత్వం ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్న సీఎంతో సహా మంత్రులు ఎవరు బహిరంగంగా స్పందించలేదు. ఇలాగే మౌనంగా ఉంటే రాజకీయంగా ఇబ్బంది వస్తుందని గ్రహించిన మంత్రి కేటీఆర్.. బీజేపీపై ఎదురుదాడికి దిగారు.
పరువు కాపాడుకునే ప్రయత్నం
ఇంతకాలం టీఎస్‌పీఎస్సీలో పారదర్శకంగా పరీక్షలు జరుగుతాయనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉండేది. కానీ వరుసగా పేపర్స్ లీకైనట్టు పోలీసులు గుర్తించడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అవుతున్న యువత.. పుస్తకాలను పక్కన పెట్టి రోడ్ల పైకి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. ఈ సమయంలో మౌనంగా ఉంటే ప్రభుత్వానికి ఇబ్బందు ఎదురవుతుందని గ్రహించిన మంత్రి కేటీఆర్.. పేపర్స్ లీక్‌లో బీజేపీ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని, ఆయన వెనక ఎవరు ఉన్నారో విచారణ చేపట్టాలని డీజీపీని కోరడం అందులో భాగమనే చర్చ జరుగుతున్నది.
రాజశేఖర్‌కు ఉద్యోగం ఎలా వచ్చింది..?
పేపర్స్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న రాజశేఖర్ అనే అవుటో సోర్సింగ్ ఉద్యోగి బీజేపీ కార్యకర్త అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచ్చిందనే ప్రశ్నలు మొదలయ్యాయి. టీఎస్పీఎస్సీలో అత్యంత కీలకమైన కాన్పిడెన్షియల్ వింగ్‌లోకి బీజేపీ కార్యకర్త ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు? బయటకు వెళ్లాక ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై ఎందుకు నిఘా పెట్టలేదని అనుమానాలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.
నిఘా కరువు..?
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోకి సాధారణ వ్యక్తులు వెళ్లడం అంత సులువు కాదు. ఏదైన పనికోసం చైర్మన్, మెంబర్లను కలవాలంటే చాలా రకాల ప్రశ్నలు వేస్తారు. లోనికి వెళ్లాలంటే రిసెప్షన్‌లో పోలీసులు ఆపేస్తారు. ఎక్కడ్నుంచి వచ్చారు? ఎవరిని కలుస్తారు? ఏం పని మీద వచ్చారు? అపాయింట్మెంట్ ఉందా? ఇలా అన్ని వివరాలు అడిగిన తర్వాత కలవాల్సిన ఆఫీసరు ఒకే చెబితేనే లోనికి పంపుతారు. అది కూడా సెల్‌ఫోన్‌ను డిపాజిట్ చేయించుకుని లోపలికి అనుమతిస్తారు. లోనికి వెళ్లిన వ్యక్తి కదలికలను సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తారు. ఇంత సెక్యూరిటీ ఉన్న ఆఫీసులో రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కదలికలపై ఎందుకు అనుమానం రాలేదని చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్‌పై పెరిగిన నెగెటివ్..
బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల నియామకాలు నత్త నడకన జరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం గతేడాది సుమారు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ అందుకు కావాల్సిన నియామక పక్రియ కోసం టీఎస్‌పీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత పది నెలలుగా వరసగా అనుమతులు ఇవ్వడంతో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సిద్ధం అవుతోన్న సమయంలో క్వశ్చన్ పేపర్స్ లీక్ కావడంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెంచుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నెగిటివ్‌ను తగ్గించుకునేందుకే బీజేపీపై ఎదురుదాడికి బీఆర్ఎస్ ప్లాన్ చేసిందనే చర్చ జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి : 'సీఎంవో కేంద్రంగానే... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ'