గవర్నర్ తమిళిసైకి బీఆర్ఎస్ నేత బహిరంగ లేఖ.. తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన

by Shiva |
గవర్నర్ తమిళిసైకి బీఆర్ఎస్ నేత బహిరంగ లేఖ.. తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గాను దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే. రాజకీయాలతో సంబంధం లేని అర్హులను మాత్రమే సిఫారసు చేయాలని సీఎం, సీఎస్‌లకు రాసిన లేఖలో గవర్నర్ తమిళిసై బదులిచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి మంత్రివర్గ సమావేశంలో నామినేటెడ్ పోస్టులకు గాను కోదండరాం, అలీఖాన్ పేర్లను సిఫారసు చేసింది. ఇదే విషయంపై ఫైర్ అయిన బీఆర్ఎస్ నాయకులు గవర్నర్‌పై మాటల యుద్ధానికి దిగారు.

తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టుకు కూడా వెళ్లారు. వాదోవాదాలు విన్న కోర్టు మరో కేబినెట్ భేటీలో ఎమ్మెల్సీ పేర్లను సిఫారసు చేయాలని సూచించింది. అయితే, తాజాగా గవర్నర్ తమిళి తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా ఆమెకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలంటూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో తనను రాజకీయంగా ఎదగనివ్వకుండా గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed