- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి పయనమవుతున్న BRS నేతలు.. రహస్యంగా వెళ్లేందుకు అధికారుల యత్నం
దిశ, సిటీ బ్యూరో: చలో హస్తిన.. ఛలో ఢిల్లీ.. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని అధికార పార్టీకి చెందిన నేతల్లో హాట్ హాట్‌గా జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా అవతరించిన తర్వాత ఢిల్లీలో పార్టీ జాతీయ తాత్కాలిక కార్యాలయాన్ని 14న ప్రారంభించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.. శాశ్వత కార్యాలయం సిద్ధమయ్యేందుకు మరో ఏడాది పట్టే అవకాశముండడం తో తాత్కాలిక ఆఫీసును ప్రారంభించేందుకు పార్టీ సిద్ధమవడం తో ఆ కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు, కార్పొరేటర్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అవే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ముఖ్యం గా గ్రేటర్‌లోని కొందరు ఎమ్మెల్యేలు, మం త్రులు భారీగా కార్యకర్తలను తరలించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ ట్రెయిన్ ఎక్కినట్లు సమాచారం. తాత్కాలిక ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరై తమ గాడ్ ఫాదర్ తో భేష్ అనిపించుకునేందుకు కొందరు కార్పొరేటర్లు కూడా పదుల సంఖ్యలో తమ కార్యకర్తలను తీసుకొని ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం. అధినేత నజర్‌లో పడేలా వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పోరాడిన పలు ప్రజా సంఘాల నేతలు కూడా హస్తిన టూ హైదరాబాద్ అంటున్నారు. ఇదిలా ఉండగా, తరుచూ అక్రమాలకు పాల్పడుతూ, అధికార పార్టీ అండతో ఎప్పటికప్పుడు తమ పోస్టులు కాపాడుకుంటున్న కొందరు అధికారులు కూడా సెలవులు పెట్టి ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
సచివాలయ స్థాయిలో పైరవీలు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత వారికి ప్రోటోకాల్ ప్రకారం వారికి కావలసిన అకామిడేషన్ కోసం సచివాలయ స్థాయిలో వారి సిబ్బంది పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో రెండు రోజుల పాటు బస చేయాలన్న ఈ ప్లాన్‌పై మంగళవారం మధ్యాహ్నానికల్లా స్పష్టత వచ్చే అవకాశామున్నట్లు తెలిసింది.
Also Read...