కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత లేఖ

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-07 08:05:06.0  )
కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ శుక్రవారం లేఖ రాశారు. 21 మే 2024 మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోం డిస్లరీస్ అనే సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై మీడియా సమావేశం పెట్టిన అనంతరం జూపల్లి కృష్ణారావు గారు నిజాన్ని ఒప్పుకొని సోమ్ డిస్లరీస్‌కు అనుమతులు ఇవ్వడం వాస్తవమే, కానీ దానిపై మంత్రికి ఎలాంటి సమాచారం లేదు.. అది బేవరేజెస్ కార్పొరేషన్ యొక్క సొంత నిర్ణయం అని బాధ్యత రహితంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారని గుర్తు చేశారు.

సోమ్ డిస్లరీస్‌కి సంస్థ రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతిగాంచిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారని.. దయచేసి కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటు లోకి తేవద్దని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి సోం డిస్లరీస్‌‌కి ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేస్తూ విక్రయదారుల ఆరోగ్యాన్ని కాపాడుతారని భావిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story