KCR సహా అందరం పాల్గొంటాం.. CM రేవంత్‌కు KTR సవాల్

by Gantepaka Srikanth |
KCR సహా అందరం పాల్గొంటాం.. CM రేవంత్‌కు KTR సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఎదుట బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక డిమాండ్ పెట్టారు. ఆదివారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan) ఎదుట కేటీఆర్(KCR) మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన రీసర్వే చేపడితే కేసీఆర్ సహా అందరం అందులో పాల్గొంటామని సవాల్ చేశారు. మొన్న చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. బీసీల గొంతు కోసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. బీసీ జనాభా(BC Population)ను ఐదున్నర శాతం తగ్గించారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణన(Caste Census) సర్వే తమకు చిత్తు కాగితంతో సమానమని కీలక వ్యాఖ్యలు చేశారు.

శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇస్తామనన్నారు.. ఐదేళ్లలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని.. ఒక వేళ వెళ్తే ప్రజలు తరిమి కొడతారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని చెప్పారు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్లు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని ఆరోపించారు. తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని చెప్పారు.

Next Story

Most Viewed