- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: అవన్నీ రేవంత్ ఖాతాలో కేసీఆర్ ఖాతాలో వేస్తున్నారు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసిన సీతారామ ప్రాజెక్టుపై కేటీఆర్ స్పందించారు. మంచి జరిగితే రేవంత్ ఖాతాలో.. చెడు జరిగితే మాత్రం కేసీఆర్ ఖాతాలో వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులన్నీ తాను పూర్తి చేసినట్లగా బిల్డప్ ఇచ్చి రేవంత్ క్రెడిట్ కొట్టేస్తున్నారని విమర్శించారు. రిజర్వాయర్లు కట్టింది పంపులు పెట్టింది బీఆర్ఎస్.. కేవలం రిబ్బన్ కట్ చేసి వదిలేసేది కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పూర్తిచేసిన సీతారామ ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేసి మేమే చేసినమని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అన్నీ గమనిస్తారు అని అన్నారు. రూ.75 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు ముగ్గురు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఒకలు పోయి భూమి ముద్దాడి వాళ్లే సీతారామ ప్రాజెక్ట్ కట్టినట్లు చేస్తున్నారు. ఈ పీఆర్ స్టంట్లతోని ప్రజలను ఎక్కువ రోజులు కన్ ఫ్యూజ్ చేయలేరని కేటీఆర్ అన్నారు.