- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యానులో తీహార్ జైలుకు కవిత.. జైలులో కవితకు స్పెషల్ అరేంజ్‌మెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధికారులు తిహార్ జైలుకు తరలించారు.ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను రౌస్అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా కవితకు కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జైలు వ్యానులో ఆమెను తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా జైలులో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కలపించాలని జైలు సూపరింటెండెంట్ కు కోర్టు ఆదేశాలిచ్చింది.
బంగారం ధరించేందుకు పర్మిషన్:
కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తిహార్ జైలు సూపర్డెంట్ కు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటి భోజనాన్ని అనుమతించడంతో పాటు నిద్రపోవడానికి పరువులు, చెప్పులు, బబట్టలు, బెడ్ షీట్స్, బ్లాంకెట్ కు అనుమతి ఇచ్చారు. అలాగే కొన్ని పేపర్లు, పెన్నులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టాబ్లెట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు బంగారం ధరించేందుకు సైతం కోర్టు అనుమతి ఇచ్చింది. మరో వైపు కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న రెగ్యులర్ వాదనలు జరగనున్నాయి.