Gellu Srinivas: కాంగ్రెస్ నేతల మాటలు మేము నమ్మం

by Gantepaka Srikanth |
Gellu Srinivas: కాంగ్రెస్ నేతల మాటలు మేము నమ్మం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పది నెలల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలన ఎలా ఉందో ముందు ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav) సూచించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అశోక్ నగర్‌కు వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం(CM Revanth Reddy) అయ్యాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. గ్రూప్-1కు కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయలేదు అని గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు.

అందుకే ముందు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలుసుకోవాలని హితవు పలికారు. ఉద్యోగాలు అడిగితే విద్యార్థులపై కేసులు పెడుతున్నారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ నేతల మాటలు మేము నమ్మం. హైదరాబాద్‌లో 163 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు బెదిరిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనలో హైదరాబాద్ నగరంలో సెక్షన్ 163 ఎత్తివేయాలి. జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో కావాలి. ప్రియాంకగాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav) గుర్తుచేశారు.

Advertisement

Next Story