Deputy CM:రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసింది : భట్టి విక్రమార్క

by Jakkula Mamatha |
Deputy CM:రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసింది : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫైరయ్యారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్‌కు అప్పజెప్పితే.. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం అప్పుల్లో ఉన్న కూడా విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా ప్రభుత్వం వెనకాడబోదు అని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలనేదే మా కోరిక అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. గత ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కనీసం పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వలేదన్నారు. ఒక్క కిలోమీటర్ SLBC టన్నెల్ కూడా తవ్వని చరిత్ర బీఆర్ఎస్(BRS) పార్టీదీ అని విమర్శించారు. 20 నెలల్లో ఎస్ఎల్బీసీ(SLBC)ని పూర్తి చేస్తాం. ప్రతి పైసా ప్రజలకే.. పాలకులు పంచుకుని తినడానికి కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Next Story

Most Viewed