BRS: ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు!.. మాజీమంత్రి కేటీఆర్

by Ramesh Goud |   ( Updated:2025-01-22 12:58:39.0  )
BRS: ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు!.. మాజీమంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: దాడి చేసింది గాక ఉల్టా మాజీ ఎమ్మెల్యే పైనే కేసు.. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో(Nalgonda Municipal Office) బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ నాయకుల(Congress Leaders) మధ్య రసాభాస జరిగింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA kancharla Bhupal Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు! అని వ్యాఖ్యానించారు.

అలాగే బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkatreddy) గూండాలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. అంతేగాక పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి గూండాలు అయితే పోలీసులు ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని, దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవని.. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని మండిపడ్డారు. ఇక మా నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన ఈ పాశవిక దాడిని ఖండిస్తున్నానని అన్నారు. బాధ్యులమీద సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవలసిందిగా కేటీఆర్, డీజీపీ(DGP Telangana) ని కోరారు.

Next Story

Most Viewed