- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ సీఎంను ప్రకటించాల్సిందే : జాజుల శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ సీఎంను ప్రకటించాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టికెట్లు కేటాయింపుల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. ప్రధాన పార్టీలు పోటీపడి రెడ్లు, రావులకే టికెట్లు ఇచ్చి బీసీలను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడ్రోజుల్లో బీసీల ద్రోహులు ఎవరో దొంగలు ఎవరో తెలుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాదులోని లక్డీకాపూల్ లోని ఓ హోటల్ లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజకీయ మేధో మదన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బీసీలకు 23 టికెట్లు ఇస్తే, కాంగ్రెస్ 20 టికెట్లు ఇచ్చిందని, బీజేపీ 33 టికెట్లు ఇవ్వడంతో పాటు బీసీని సీఎం చేస్తానమంటూ ప్రకటించిందన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న బీసీ సభలో పాల్గొంటున్న ప్రధాని మోదీతో బీసీ సీఎంతో పాటు, బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రకటన చేయించాలని టీ బీజేపీ నేతలను కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని, మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పిస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
రెండు రోజుల్లో తిరిగి బీసీల విస్తృత సమావేశాన్ని నిర్ణయించి భవిష్యత్తు రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. బీసీలకు రాజకీయ మిత్రులు, శత్రువులు ఎవరో ఈనెల 9న నిర్ణయిస్తామని ప్రకటించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలలో కులతత్వం, కుటుంబ తత్వం తప్ప సామాజిక న్యాయం ఉండదని మండిపడ్డారు. బీసీలు ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని ఆగం కావద్దని బీసీలే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీసీలు ఐక్యతను చాటిచెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాడికొండ విక్రమ్ గౌడ్ ,యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, బీసీ నేతలు దుర్గయ్య, పాండు, ఈడిగ శ్రీనివాస్ ,మహేష్ యాదవ్, వడ్లకొండ వేణుగోపాల్, జాజుల లింగం, చాప శివరాములు, కొత్త నరసింహస్వామి, కనకయ్య గౌడ్ ,కోనపురి కవిత, రవీందర్ ముదిరాజ్, వరికుప్పల మధు, బడేసబ్, జలజ, దేవిక, నరసింహ నాయక్, గూడూరు భాస్కర్, ఇంద్రమ్ రజక, మలుసురుగౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.