- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాలి'.. సుందరయ్య పార్క్ వద్ది నిరసన
దిశ, తెలంగాణ బ్యూరో: రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత ర్లెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను పదవి నుంచి తొలగించాలని, అంతేకాకుండా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. నెల రోజులుగా మహిళా రెజ్లర్లు చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తాత్సారం చేయడండపై యూటీఎఫ్ నేతలు ధ్వమజెత్తారు. రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా బుధవారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించిన మహిళా క్రీడాకారుల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవటం దుర్మార్గమన్నారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే నామమాత్రంగా కేసునమోదు చేసి చేతులు దులుపుకున్నారని, నిందితుడు అధికార పార్టీ ఎంపీ కావడంతోనే అతనిపై చర్య తీసుకోకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం రోజున నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రెజ్లర్లను అడ్డుకుని కేసు పెట్టారని, ఢిల్లీ జంతర్ మంతర్ లో నెల రోజులుగా నడుస్తున్న ఆందోళనా శిబిరాన్ని తొలగించి నిలువ నీడ లేకుండా చేయటం దారుణంగా పరిగణించారు.