- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రక్షాళణకు రంగం సిద్ధం.. 112 మంది వైద్యులపై వేటు!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందిని ప్రక్షాళణ చేసేందుకు పూనుకుంది. ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం లేకుండా.. ఇష్టానుసారంగా కళాశాలలకు రోజుల తరబడి హాజరు కాని వైద్యులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న దాదాపు 112 మంది వైద్యులపై వేటు వేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించి వైద్యుల జిబితాను కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది.
పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు కాకపోవడంతో అటు వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అదేవిధంగా వైద్య విద్యార్థులు తరగతులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. క్లాసులతో పాటు వైద్య సేవలకు అందించే ఆసుపత్రులు కావడంతో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆయా కళాశాలల్లొ ఓపీ శాతం పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో విధులకు గైర్హాజరు అవుతున్న 112 మంది వైద్యులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయబోతున్నారు. అనంతరం వారిని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.