బ్రేకింగ్ : అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందా..

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-11 04:43:45.0  )
బ్రేకింగ్ : అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందా..
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందా దూమారం రేపుతోంది. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచరులమంటూ దళిత వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి 346 సర్వే నంబర్ లో గడీల శ్రీనివాస్ నుంచి నాలుగు ఎకరాల భూమి రెండు నెలల క్రితం కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి చేశారని నవీన్ ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. వేసిన ఫెన్సింగ్ ను ట్రాక్టర్ తో కూల్చేశారని, కర్రలతో తమపై దాడి చేశారని తెలిపారు.

నోటికొచ్చినట్లు తిట్టారని తమ బైక్ తగటబెట్టారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే భూ పంచాయితీని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓ ఫాం హౌజ్ లో నిర్వహించగా ఎమ్మెల్యే మాటలు సంచలనంగా మారాయి. ఆ వీడియోలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జరిగిందేదో జరిగిపోయింది.. కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు.. ఆ భూమిని తన అనుచరులకు వదిలేయండి అని చెప్పిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఎమ్మెల్యే ఒత్తిడితో కొంత మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలని పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోయారు.

Advertisement

Next Story