బ్రేకింగ్ : ప్రగతి భవన్ దగ్గర రాజాసింగ్ అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 06:42:05.0  )
బ్రేకింగ్ : ప్రగతి భవన్ దగ్గర రాజాసింగ్ అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్‌ను ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ వద్ద వదిలి పెట్టడానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం అసెంబ్లీ నుంచి ఇంటికి వెళుతుండగా ఎమ్మెల్యే కారు టైర్ పేలి పోయిన విషయం తెలిసిందే. దీనిపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో కూడా తనకు ఇచ్చిన కారు సమస్యలు కలిగించిందన్నారు.

ఈ కారును వాపస్ తీసుకొని వేరే వాహనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసారు. కొత్త కారు ఇవ్వలేక పోతే తానే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకుంటానన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం క్యాంపు ఆఫీస్ వద్దకు వచ్చిన రాజాసింగ్ అక్కడ తన కారును వదిలేసి వెళుతుండగా పోలీసులు ఆయనను అదుపుకి తీసుకున్నారు. ఎక్కడ వదలమని చెబితే అక్కడ రాజాసింగ్‌ను వదులుతామని పోలీసులు చెప్పారు.

Read more:

కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed