Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. అసలు కారణం ఇదే!

by Shiva |
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. అసలు కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ప్రశాంతంగా ఉండే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా అలజడి రేగింది. సోమవారం ఉదయం ఎయిర్‌పోర్టుకు వచ్చిన కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్‌‌లైన్స్ విమానం ఆలస్యం అయింది. అర్జెంట్ పని మీద తమ గమ్య స్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు మూకుమ్మడిగా ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్ ఆలస్యమని ఇప్పుడు చెప్పడం ఏంటని మండిపడ్డారు. వెంటనే ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ప్రయాణికులకు సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.

Next Story