BREAKING: ఓఆర్ఆర్‌పై పార్థీ గ్యాంగ్ హల్‌చల్.. పోలీసుల చేజింగ్, గాలిలో కాల్పులు

by Shiva Kumar |
BREAKING: ఓఆర్ఆర్‌పై పార్థీ గ్యాంగ్ హల్‌చల్.. పోలీసుల చేజింగ్, గాలిలో కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో వరుస దోపిడీలతో జనాన్ని గడగడలాడిస్తున్న పార్థీ గ్యాంగ్ శుక్రవారం తెల్లవారుజామున హైదారాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై హల్‌చల్ సృష్టించింది. నల్లగొండ పట్టణంలో చోరీకి పాల్పడి ఓఆర్ఆర్ మీదుగా పారిపోతున్న దొంగలను నల్లగొండ సీసీఎస్ పోలీసులు వెంబడించారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా విడిపోయిన వారు నార్కట్‌పల్లి నుంచి పార్థీ గ్యాంగ్‌ వెంబడిస్తూ వచ్చారు. దొంగలు ఓఆర్ఆర్ వద్ద కంటపడిన వెంటనే వారిని పట్టుకునేందుకు ఓఆర్ఆర్‌పై సినిమా లెవెల్లో ఛేజింగ్ చేశారు. ఒకనొక దశలో పార్థీ గ్యాంగ్ కత్తులతో దాడికి తెగబడటంతో పోలీసులు గాలిలోకి కొన్ని రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో నలుగురు దొంగలను వారు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పెట్రోల్ బంకులు, ఇల్లు, బ్యాంకులు దోచుకోవడంలో పార్థీ గ్యాంగ్‌ ఆరితేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆ గ్యాంగ్‌పై పదుల సంఖ్యలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌గా పార్థీ గ్యాంగ్ పోలీసుల హిట్ లీస్ట్‌లో ఉంది.

Next Story