BREAKING: చెట్లు, పుట్టలు, గుట్టలకు ఇక రైతుబంధు ఇవ్వం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: చెట్లు, పుట్టలు, గుట్టలకు ఇక రైతుబంధు ఇవ్వం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏం చేసిందని బీజేపీకి ఓటు వేయాలంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇవాళ తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా అన్ని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని మన దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేసినందుకు ఆ పార్టీ ఓటు వేయాలా అని ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బీజేపీ ప్రభుత్వ హాయాంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రాష్ట్రం దుబారా ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక నుంచి చెట్లు, పుట్టలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి నిజమైన రైతుకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story