విద్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

by Disha Web Desk 18 |
విద్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఎప్పుడెప్పుడు పరీక్షఫలితాలు వస్తాయా అని ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందింది. మరి కొన్ని గంటల్లో ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 24 అనగా బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం విద్యార్థులు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు. ఇక ఏప్రిల్ 1నాటికి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాయి. కాగా, ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed