- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: అక్క, చెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు: కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని రాష్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పథకంపై నిన్న జరిగిన పార్టీ సమావేశంలో సెటైర్లు వేశారు. బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘బస్సుల్లో కుట్లు, అల్లికలు మేం వద్దనట్లేదు. అవసరమైతే బ్రేక్ డ్యాన్స్‌లు వేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బస్సుల్లో సీట్లు దొరక్క ఓ వైపు జనం తన్నుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నాం’ అని కేటీఆర్ తెలిపారు.
దీంతో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు మహిళా కమిషన్ ఆక్షేపించింది. ఈ మేరకు కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది. అదేవిధంగా మంత్రి సీతక్క కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్‌కు మిండుగు పడటం లేదని కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్క, చెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’. అంటూ ట్వీట్ చేశారు.