BREAKING: తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Shiva |
BREAKING: తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, గద్వాల్, నల్లగొండల మీదుగా నైరుతీ రుతు పవనాలు ప్రవేశించాయని పేర్కొంది. సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతు పవనాలు ఎంటర్ రావాల్సి ఉండగా.. ఈ ఏడాది వారం రోజుల ముందే రుతు పవనాలు రాష్ట్రాన్ని పలుకరించాయి. ఈ ప్రభావంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed