- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ‘కిషన్‌రెడ్డి.. నామినేటెడ్ బై కేసీఆర్’ అంటున్నారు.. ఆ కథేంది: మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ నాయలకు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ అందరికీ తెలుసని అన్నారు. మహారాష్ట్రలో కూల్చిన విధంగా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం కుదరదని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఏవో కుట్రలు చేయబోతున్నారని, అవన్నీ తమకు తెలుసని పేర్కొన్నారు. ఇన్నాళ్లు బీజేపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపారని, అదే తెలంగాణ సంపదను ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ పెద్దలు ఎందుకు జైలుకు పంపడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారని, అయితే, ఆ నియామకాన్ని అందరూ ‘కిషన్ రెడ్డి.. నామినేటెడ్ బై కేసీఆర్’ అన్నారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు.