- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పరిగణిస్తూ కేసులో సీబీఐ ఆమె పేరును చేర్చింది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం 41 (ఆ) కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఇదే కేసు విషయమై 2022 డిసెంబర్‌లో సీబీఐ ఒకసారి కవితను ప్రశ్నించిన విషయం విదితమే.
కాగా, ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడీ తనను విచారించడపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కి్ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీబీఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.