- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ‘హైడ్రా’తో హైడ్రామా నడుపుతుండ్రు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హైడ్రాతో ప్రభుత్వం హైడ్రామా నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలకు దిగుతోందని ఎదురుదాడి చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాయని అన్నారు. పాలకులు, అధికారులు కుమ్మకై అనుమతులు ఇచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా అక్రమ నిర్మాణాలకు వాటర్, కరెంట్ కనెక్షన్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. హైడ్రాతో అక్రమ నిర్మాణాలను ఎలాగైతే నేలమట్టం చేస్తున్నారో.. మౌలిక అవసరాలకు అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ప్రభుత్వం కూల్చివేతలపై లోతుగా చర్చించి, సమగ్రంగా అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.