- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. భారీ భవనం నేలమట్టం
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా)కు అంకురార్పణ చేసింది. ఈ సంస్థకు చైర్మన్ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను సర్కార్ నియమించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అప్పుడే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వం భూములను కబ్జా చేయాలనే ఆలోచన రాకుండా చేసేందుకు ఆ సంస్థ నేరుగా యాక్షన్‌లోకి ఎంటరైంది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో బహుళ అంతస్థుల బిల్డింగ్‌ను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగానాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.