BREAKING: అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త.. ఎకరానికి ఇక రూ.10 వేలు

by Shiva |   ( Updated:2024-03-20 15:57:11.0  )
BREAKING: అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త.. ఎకరానికి ఇక రూ.10 వేలు
X

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ వెల్లడించారు. అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని జిల్లాల వారీగా అధికారులు అంచనా వేసి నివేదిక తయారు చేస్తున్నారని, ఆ నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే నష్ట పరిహారాన్ని రైతు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలలో రాళ్ల వర్షాలు కురవడంతో పంట నీట మునిగింది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాక అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా రైతు‌బంధు సాయాన్ని కొనసాగిస్తామని, మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని జమ చేశామని తెలిపారు. రైతు బంధు నిరంతర ప్రక్రియ అని, మార్చి నెలాఖరు అందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు రుణమాఫీపై కూడా కసరత్తు చేస్తున్నామని. ఏక కాలంలో రైతులను రుణమాఫీ చేసి వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని మంత్రి తుమ్మల అన్నారు.

Advertisement

Next Story

Most Viewed