BREAKING: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన!

by Shiva |
BREAKING: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవిలో సాగునీరు లేక పంటలు ఎండుతున్న నేపథ్యంలో రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశార. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల భీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా, పంటల భీమా అమలుకు కవాల్సిన నిధుల సమీకరణపై మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.

ఇప్పటి వరకు వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వారందని నుంచి డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వర్షాకాలం కావడంతో కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్క్‌ఫెడ్‌ కేంద్రంగా రైతులకు తీసుకొచ్చే అన్ని రకాల పంటల కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed