BREAKING: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్

by Shiva |
BREAKING: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు అనవసరంగా తీస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె అదే రేంజ్‌లో కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదని హితవు పలికారు. లేదంటే తాము కూడా గట్టిగానే సమాధానం చెబుతామంటూ ఎదురుదాడికి దిగారు. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తారట అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనుకు ఇప్పటి ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరినైనా.. ప్రశ్నించే హక్కు ఉందంటూ సమాధానమిచ్చారు.

Advertisement

Next Story