Bomb Threat: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కలకలం.. అదుపులో నిందితుడు

by Ramesh N |   ( Updated:2025-02-04 11:14:04.0  )
Bomb Threat: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కలకలం.. అదుపులో నిందితుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయానికి (Telangana Secretariat) బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. సెక్రటేరియట్‌ను బాంబు పెట్టి పేల్చి వేస్తామని బెదిరింపు కాల్ (Bomb threat call) వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం సీఎం పీఆర్ఓ ఆఫీస్‌కి ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో నిందితుడిని గుర్తించి ఎస్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే కాల్ చేసిన వ్యక్తి తనకు ఆఫీస్‌లో ఏదో పని ఉండడంతో బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే పోలీసులు తాజాగా ఆ బెదిరింపునకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని మరో వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు.

Advertisement
Next Story

Most Viewed