- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'గర్భిణీలకు మెయిన్స్ అవకాశం ఇవ్వాలి.. లేదంటే డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం'
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలీస్ నియామకాల్లో రాత పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీలకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తర్వాత ఫిజికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని గురువారం ఆయన కోరారు. గర్భిణీల స్థానంలో కేసీఆర్, డీజీపీ, బోర్డు అధికారుల కుటుంబ సభ్యులు ఉంటే ఇలాంటి నియమాలు చెప్పేవారా అని ప్రశ్నించారు. బోర్డ్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తు్న్నదని మండిపడ్డారు. అర్హత సాధించిన గర్భిణులను ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులు అనడం సిగ్గుచేటన్నారు.
కనీస మానవీయ కోణం లేని ప్రభుత్వం, అధికారులు ఉండటం తెలంగాణ దౌర్భాగ్యంగా భావిస్తున్నామన్నారు. ఉత్తీర్ణత సాధించిన మహిళ అభ్యర్థుల్లో ఉన్న గర్భిణీలు డైరెక్ట్‌గా మెయిన్స్ పరీక్షల్లో పాల్గొనవచ్చని, మెయిన్స్‌లో సెలెక్ట్ అయిన వారికి తర్వాత ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని అధికారికంగా తెలిపిన విషయాన్ని ఇపుడు కాదనడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో అభ్యర్థులతో కలిసి డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Also Read...