BJP: శరవేగంగా కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ పనులు.. కేంద్రమంత్రి ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |
BJP: శరవేగంగా కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ పనులు.. కేంద్రమంత్రి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కొమురవెల్లి హాల్ట్ స్టేషన్(Komuravelli Halt Station) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తెలియజేశారు. కొముర వెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద నూతన రైల్వే స్టేషన్(New Railway Station) నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శంఖుస్థాపన జరిగింది. ఈ పనులకు సంబంధించిన విషయాలను కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీనిపై ఆయన తెలంగాణ రాష్ట్రం(Telangana State) సిద్దిపేట జిల్లాలోని(Siddipeta District) కొమురవెల్లి(Komuravelli) గ్రామంలో ఫిబ్రవరి 2024లో శంకుస్థాపన జరిగిన నూతన రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణం అత్యంత వేగంగా పూర్తవుతోందని, ఈ హాల్ట్ స్టేషన్ నిర్మాణం 70 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. అలాగే కొత్త హాల్ట్ స్టేషన్ పూర్తయిన తర్వాత, కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు, ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చే భక్తులకు ఇది మెరుగైన సదుపాయాలతో కూడిన కనెక్టివిటీని పెంచి స్థానిక ప్రాంత ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సమర్థమైన, పటిష్టమైన పాలనలో మౌలిక సదుపాయాలపై అభివృద్ధికి ఈ నిర్మాణం నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed