నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అంటూ అతనితో ఉన్న క్యూట్ ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్.. మీకాంబోలో మరో సినిమా కావాలంటూ కామెంట్స్..

by Kavitha |   ( Updated:2025-04-07 06:36:44.0  )
నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అంటూ అతనితో ఉన్న క్యూట్ ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్.. మీకాంబోలో మరో సినిమా కావాలంటూ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘దేవర’(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prasanth Neel)తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘వార్-2’(War-2) మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు ఎన్టీఆర్. అలాగే ఫెస్టివల్ విషెస్ కూడా తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెడతారు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టాడు.

అందులో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌(Sukumar)తో సన్నిహితంగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్’ అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ ఫొటో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మీకాంబోలో మరో సినిమా కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’(Nannaku Prematho) మూవీ ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది.

Read More..

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటో తెలుసా..?



Next Story